బోనాల పండుగ వేళ మద్యం అమ్మకాలపై ఆంక్షలు
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసివేత ఆగస్టు 9 నుంచి 11 వరకు ప్రాంతాలవారీగా అమల్లో నిషేధం శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల ముందస్తు చర్యలు

హైదరాబాద్: బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రాంతాలవారీగా మద్యం దుకాణాలు, బార్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. చార్మినార్ జోన్లో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు, రాజేంద్రనగర్–గోల్కొండ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు సమాచారం. స్టార్ హోటళ్లకు మినహాయింపు ఉన్నట్లు పేర్కొన్నారు.

