ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

'ఏపీ అస్త్రం' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించాలి: ట్రాఫిక్ సీఐ రవికుమార్

మొగల్రాజపురం జూడియో వద్ద అవగాహన కార్యక్రమం వాహనదారులు, కొనుగోలుదారులతో యాప్ డౌన్‌లోడ్ చేయింపు ప్రజల భద్రతకు ఉపయోగపడే సాంకేతిక వేదికగా 'ఏపీ అస్త్రం'

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 12:50 PMకి 1,122 వీక్షణలు
'ఏపీ అస్త్రం' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించాలి: ట్రాఫిక్ సీఐ రవికుమార్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 5 (వి10టీవీ): రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని విజయవాడ ట్రాఫిక్ సీఐ రవికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం మొగల్రాజపురంలోని జూడియో షోరూమ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ లోవరాజుతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించిన 'ఏపీ అస్త్రం' యాప్ ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడే విధంగా రూపొందించబడిందన్నారు. ట్రాఫిక్ సమాచారం, అత్యవసర ఎస్‌ఓఎస్ సేవలు, పోలీసులకు ఫిర్యాదులు అందించడం, భద్రతకు సంబంధించిన సేవలను ఒకే వేదికపై పొందే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించబడిందని తెలిపారు. సాంకేతికతను ప్రజల భద్రత కోసం వినియోగించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వాహనదారుడు, ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రజలు పోలీసు శాఖతో మరింత సులభంగా అనుసంధానం కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఆర్‌ఎస్‌ఐ లోవరాజు వాహనదారులు, కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడి వారి మొబైల్ ఫోన్లలో 'ఏపీ అస్త్రం' యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, దాని వినియోగ విధానాన్ని వివరించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సురక్షిత సమాజ నిర్మాణంలో 'ఏపీ అస్త్రం' కీలక పాత్ర: డీసీపీ షిరీన్ బేగం

16 నిమిషాల క్రితం 1,257

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ గళం.. లోకేష్ రాజీనామా వరకు పోరాటం: ఆర్కే రోజా, భూమన

2 గంటల క్రితం 553

నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

3 గంటల క్రితం 897

బీహార్‌లో బీజేపీకి షాక్.. ప్రశాంత్ కిషోర్

నిన్న 636