రూటు మార్చిన సీఎం.. ప్రజల ముందే అధికారులకు క్లాస్!
చీరాల సభలో అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి. డేటాను దాచొద్దని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని ఆదేశం. అధికారుల జవాబుదారీతనమే ప్రభుత్వ విజయానికి కీలకమని స్పష్టం.

చీరాలలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దాచిపెట్టకుండా వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని, గణాంకాలు చెప్పడం కంటే క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం సహించబోమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

