మానవత్వమే పోలీసుల అసలైన బలం
వృద్ధుడిని ఎత్తుకొని రోడ్డు దాటించిన ట్రాఫిక్ హోంగార్డు రాంబాబు... మానవీయ సేవకు ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం ప్రశంసలు... విధి నిర్వహణలోనే కాదు.. ఆపన్నులకు అండగా నిలవడంలోనూ ముందంజ...

విజయవాడ, అక్టోబరు 22: విధి నిర్వహణలో నిబద్ధత.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవత్వం.. ఈ రెండింటినీ చాటుకున్నారు విజయవాడ ట్రాఫిక్ హోంగార్డు రాంబాబు. పీఎన్‌బీఎస్ బస్‌స్టేషన్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఆయన, రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న కాళ్లు లేని ఓ వృద్ధుడిని గమనించారు. వెంటనే స్పందించి ఆ వృద్ధుడిని ఎత్తుకొని సురక్షితంగా రోడ్డు దాటించారు. విధి నిర్వహణతో పాటు మానవీయ స్పందన ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో ఉన్నప్పటికీ, సహాయం అవసరమైన వృద్ధుడిని చూసి వెంటనే స్పందించిన రాంబాబు తీరు పలువురిని ఆకట్టుకుంది. విధి నిర్వహణ అంటే కేవలం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడమే కాకుండా, ప్రజల కష్టాల్లోనూ తోడుగా నిలవడమేనని ఆయన తన చర్యతో చాటిచెప్పారు. హోంగార్డుకు డీసీపీ అభినందనలు ఈ ఘటన గురించి తెలుసుకున్న విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం, ఐపీఎస్, హోంగార్డు రాంబాబును ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణతో పాటు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం పోలీసుల సేవాభావానికి, మానవత్వానికి నిదర్శనమని ప్రశంసించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూనే, అవసరమైన సమయంలో బాధితులకు అండగా నిలవడం పోలీసు సేవల్లో అంతర్భాగమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. హోంగార్డు రాంబాబు చూపిన మానవత్వం పోలీసు శాఖకు గౌరవాన్ని తీసుకొచ్చింది.

