ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పత్తి కొనుగోళ్లపై సర్కారు దృష్టి!

2026–27 ఖరీఫ్ సీజన్‌కు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు... రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు... క్వింటాల్‌కు రూ.8,667 మద్దతు ధర.. రాష్ట్రంలో సుమారు రూ.9 వేలు...

V10TV న్యూస్ డెస్క్ 22 అక్టోబర్, 2026 6:49 PMకి 2,793 వీక్షణలు
పత్తి కొనుగోళ్లపై సర్కారు దృష్టి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో 2026–27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.8,667 మద్దతు ధర ప్రకటించగా, రాష్ట్రంలో ప్రస్తుతం పత్తి ధర సుమారు రూ.9 వేలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తం 29.43 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులు తమ పంటను విక్రయించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం లేకుండా పత్తిని సేకరించడం, రైతులకు గిట్టుబాటు ధర అందేలా పర్యవేక్షించడం ప్రధాన లక్ష్యాలుగా పనిచేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సింగ్‌నగర్‌లో కూటమి ప్రచార జోరు!

20 నిమిషాల క్రితం 3,690

ప్రజాసేవే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం!

27 నిమిషాల క్రితం 4,872

హామీల అమలే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం!

32 నిమిషాల క్రితం 4,556

ఎస్‌ఈసీ కార్యాలయం ఎదుట వైసీపీ నిరసన సెగ!

1 గంట క్రితం 3,216