రైతు పోరాటానికి వైసీపీ నేతల సంఘీభావం
► పెడనలో కొనసాగుతున్న రైతు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతలు... ► రైతుల డిమాండ్లకు మద్దతుగా సంఘీభావం ప్రకటించిన గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు... ► జిల్లా, విద్యార్థి విభాగ నేతలతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైసీపీ నాయకులు..

మచిలీపట్నం, పెడన: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో పెడన పట్టణంలో కొనసాగుతున్న రైతు రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి పలువురు వైసీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల పరిషత్ అధ్యక్షులు సంగా మధుసూదనరావు పాల్గొని రైతులను పరామర్శించి, వారి న్యాయమైన డిమాండ్లకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిపర్తి రవికుమార్, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు పోతన ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

