కృష్ణలంకలో కత్తితో యువకుడిపై దాడి!
బైకుల మరమ్మతుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ… మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపైనే కత్తితో దాడి… బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు…

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ కృష్ణలంకలో బైకుల మరమ్మతుల విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. రాకేష్ అనే యువకుడిపై కార్తీక్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అందిన సమాచారం ప్రకారం రాకేష్ ఇంటి ముందు ఉన్న రెండు బైకులను కార్తీక్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు ఢీకొట్టారు. దీంతో బైకులు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయించాలని రాకేష్ కోరాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ముదిరిపోవడంతో కార్తీక్ తన వద్ద ఉన్న కత్తితో రాకేష్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడి ఘటనపై బాధితుడు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

