దుర్బేసుల హుస్సేన్‌కు ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా హుస్సేన్ నియామకం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో భేటీ దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియమితులైన దుర్బేసుల హుస్సేన్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన హుస్సేన్‌ను ప్రత్తిపాటి శ్రీధర్ దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు దుర్బేసుల మీరావలి పాల్గొన్నారు.

