కృష్ణా జిల్లా ఎన్టీయూసీ పగ్గాలు శ్రీకాంత్
మంగళగిరి శ్రీకాంత్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు... నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర నాయకత్వం... కార్మికుల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతమే లక్ష్యమన్న శ్రీకాంత్...

గన్నవరం: కృష్ణా జిల్లా ఎన్టీయూసీ అధ్యక్షుడిగా మంగళగిరి శ్రీకాంత్ నియమితులయ్యారు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చెందిన శ్రీకాంత్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పోల చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి రావడంలో సహకరించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు షర్మిల, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్, రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ చానా బాషాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలో ఎన్టీయూసీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని శ్రీకాంత్ పేర్కొన్నారు. కార్మికులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాడతానన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

