పెన్షన్ కోసం ఎదురుచూపులకు తెర!
అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా మంజూరు: మంత్రి లోకేశ్... దరఖాస్తుల పరిశీలనకు త్వరలో వెరిఫికేషన్ ప్రక్రియ... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది ఎదురుచూపులు...

అమరావతి, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రుల సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం.
ఇప్పటికే అందిన దరఖాస్తులను పరిశీలించేందుకు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హతలను నిర్ధారించిన అనంతరం కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. ఈ నెలలోనే దరఖాస్తుల పరిశీలన చేపట్టి, అక్టోబర్ నుంచి అర్హులకు దశలవారీగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.అమరావతి, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రుల సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం.
ఇప్పటికే అందిన దరఖాస్తులను పరిశీలించేందుకు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హతలను నిర్ధారించిన అనంతరం కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. ఈ నెలలోనే దరఖాస్తుల పరిశీలన చేపట్టి, అక్టోబర్ నుంచి అర్హులకు దశలవారీగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

