వీఐటీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి!
మొదటి అంతస్తులో ధ్యానేష్ మృతదేహం గుర్తింపు… విద్యార్థి మృతిపై తోటి విద్యార్థుల్లో అనుమానాలు… మృతికి కారణాలపై వీడని సందిగ్ధత…

గుంటూరు, నవంబర్ 9: గుంటూరు జిల్లా ఐనవోలులోని వీఐటీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ధ్యానేష్ అనే విద్యార్థి మృతదేహం మొదటి అంతస్తులో గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం అందింది. ధ్యానేష్ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. విద్యార్థి మృతిపై తోటి విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అసలు ఏం జరిగింది? విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

