ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

సేవలకు సలాం.. వాలంటీర్లకు సత్కారం!

దసరా నుంచి కార్నివాల్ వరకు ట్రాఫిక్ నియంత్రణలో కీలక పాత్ర... 35 మంది వాలంటీర్లకు ప్రశంసా పత్రాలతో ప్రత్యేక గుర్తింపు... సేవా స్ఫూర్తిని కొనియాడిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 8:45 PMకి 3,601 వీక్షణలు
సేవలకు సలాం.. వాలంటీర్లకు సత్కారం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 28 : ఉత్సవాల్లో జనసందోహం.. రహదారులపై వాహనాల రద్దీ.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసులకు అండగా నిలిచిన స్వచ్ఛంద సేవకులకు అరుదైన గౌరవం దక్కింది. దసరా మహోత్సవాలు మొదలుకొని విజయవాడ ఉత్సవ్, కార్నివాల్, సరస్ మేళా వరకు నగరంలో నిర్వహించిన భారీ కార్యక్రమాల్లో ట్రాఫిక్ నియంత్రణకు తమవంతు సహకారం అందించిన 35 మంది వాలంటీర్ల సేవలను పోలీసు శాఖ ప్రత్యేకంగా గుర్తించింది. బుధవారం విజయవాడలోని వ్యాస్ కాంప్లెక్స్‌లో ఉన్న ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. రద్దీ వేళ పోలీసులకు అండగా.. వేలాది మంది ప్రజలు తరలివచ్చే ఉత్సవాల వాలంటీర్ అభినందనీయుడని కొనియాడారు. సేవలను గుర్తించి గౌరవించడం ద్వారా మరింతమంది యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారని ఆకాంక్షించారు. యువతలో సేవాభావం పెరగాలి.. ప్రజల భద్రత, సౌకర్యం కోసం పనిచేయడంలో లభించే సంతృప్తి ప్రత్యేకమైనదని డీసీపీ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే భారీ కార్యక్రమాల్లోనూ ఇదే స్ఫూర్తితో పోలీసు శాఖకు సహకరించాలని వాలంటీర్లను కోరారు. ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేసే వారిని పోలీసు శాఖ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీలు డి. పవన్ కుమార్, వేద, రోటరీ క్లబ్ ప్రతినిధులు, ఆర్‌ఎస్‌ఐ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కొండల చెంత పొంచి ఉన్న ముప్పు!

1 గంట క్రితం 5,698

కుప్పకూలిన ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం!

1 గంట క్రితం 5,489

పోలింగ్ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!

2 గంటల క్రితం 5,866

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: డీసీపీ గుణ్ణం రామకృష్ణ

2 గంటల క్రితం 5,280