కరెంట్ షాక్‌తో రెండేళ్ల బాలుడు మృతి
చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాద ఘటన... తెరిచి ఉన్న విద్యుత్ మీటర్ బాక్స్ వద్ద ప్రమాదం... గణేష్ రాథోడ్ మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు...

చందానగర్: పాపిరెడ్డి కాలనీలో కరెంట్ షాక్‌కు గురై రెండేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గణేష్ రాథోడ్ (2)గా గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు సునీల్ రాథోడ్, స్వప్న. వీరి స్వగ్రామం జహీరాబాద్ కాగా, రెండు నెలలుగా పాపిరెడ్డి కాలనీలోని 47వ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం కాలనీలోని 16 బ్లాక్‌లకు సంబంధించిన విద్యుత్ మీటర్ బాక్స్ గేటు తెరిచి ఉండగా, బాలుడు అక్కడికి వెళ్లి విద్యుత్ వైర్లను ముట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతి చెందినట్లు సమాచారం.
రెండేళ్ల చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

