ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రమణ్యంకు ఉత్తమ సేవా పతకం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఐ ఏ. సుబ్రమణ్యంకు అరుదైన గౌరవం... మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకం ప్రదానం... పోలీస్ కమిషనర్ ఎన్. రాజశేఖర్ సమక్షంలో పురస్కారం అందుకున్న సీఐ...

విజయవాడ, ఆగస్టు 15, V10TV AP: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. సుబ్రమణ్యం ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సీఐ ఏ. సుబ్రమణ్యంకు ఉత్తమ సేవా పతకాన్ని ప్రదానం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్. రాజశేఖర్ సమక్షంలో సీఐ సుబ్రమణ్యం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా పతకం లభించడంపై పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

