ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతం!

ఐదు రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల కేంద్రాలు ఖరారు… సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు… అధికారుల సమన్వయంతో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం…

V10TV న్యూస్ డెస్క్ 2 నవంబర్, 2026 12:56 PMకి 7,529 వీక్షణలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కడప, నవంబర్ 2: వైఎస్సార్ కడప జిల్లాలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలను వేగవంతం చేసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఐదు డివిజన్లలో కేంద్రాల కేటాయింపు బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బి.కోడూరు, మైదుకూరు, సాకన్, బి.మట్టం, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల మండలాలకు బద్వేల్‌లోని అంబేద్కర్ గురుకులాన్ని కేంద్రంగా నిర్ణయించారు. జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని మైలవరం, దువ్వూరు, పెద్దముడియం, ప్రొద్దుటూరు మండలాలకు జమ్మలమడుగులోని పాలిటెక్నిక్ కళాశాలను కేటాయించారు. కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా ఖరారు చేశారు. పులివెందుల డివిజన్ పరిధిలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలకు పులివెందులలోని జెడ్పీహెచ్‌ఎస్, రామనప్ప సత్రం, అన్నకాలమగుడు పాఠశాలను కేంద్రంగా నిర్ణయించారు. రాజంపేట డివిజన్ పరిధిలోని నందలూరు, రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలకు రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేటాయించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత,కౌంటింగ్ కేంద్రాల్లో బారికేడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు నిబంధనల ప్రకారం ఏర్పాట్లను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తుపాను హెచ్చరికలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం!

1 గంట క్రితం 6,875

మద్యం మత్తులో కన్నబిడ్డ ప్రాణాలు తీసిన తండ్రి!

1 గంట క్రితం 6,987

బూత్‌ల ఆక్రమణ ఆరోపణలు.. ఏపీలో మళ్లీ పోలింగ్!

1 గంట క్రితం 8,464

అర్ధరాత్రి ఇంటిపై దాడి.. జనసేన నేతలపై దేవినేని అవినాష్ ఆగ్రహం!

1 గంట క్రితం 6,602