పెడన మున్సిపల్ పీఠంపై జనసేన జెండా!
4,380 ఓట్ల మెజార్టీతో జోత్స్న రాణి విజయం… వైసీపీ అభ్యర్థి కటకం నాగకుమారిపై గెలుపు… పెడనలో సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు…

పెడన, నవంబర్ 3: పెడన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బల్లా జ్ఞాన లింగ జోత్స్న రాణి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కటకం నాగకుమారిపై 4,380 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో పెడన మున్సిపల్ చైర్మన్ పీఠం జనసేన ఖాతాలో చేరింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

