రోడ్డు ప్రమాదంలో డీజీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం
విజయవాడ ట్రాఫిక్ డీసీపీ హరీష్ బేగం కుమార్తె ఆసిఫా మృతిపై తీవ్ర విచారం... ఆసిఫా మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం...

అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ హరీష్ బేగం కుమార్తె ఆసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆసిఫా మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్న సీఎం, ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి మృతి చెందడం కలచివేసిందన్నారు. హరీష్ బేగం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

