‘అస్త్రం’ యాప్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్
ఆర్.ఎస్. బ్రదర్స్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించిన గవర్నర్‌పేట సీఐ బి. బాల మురళీకృష్ణ యాప్ డౌన్‌లోడ్ విధానం, ఉపయోగాలను వివరించిన ఎస్‌ఐ రేవతి, పోలీసు సిబ్బంది ప్రజలతో అక్కడికక్కడే ‘అస్త్రం’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించిన పోలీసులు

విజయవాడ ఆగస్టు 16, V10TV AP: నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు గవర్నర్‌పేట పోలీసులు ‘ఏపీ అస్త్రం’ యాప్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.ఎస్. బ్రదర్స్ షాపింగ్ మాల్ వద్ద సీఐ బి. బాల మురళీకృష్ణ, ఎస్‌ఐ రేవతి తమ సిబ్బందితో కలిసి ఆదివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఏపీ అస్త్రం’ యాప్‌ను మొబైల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, యాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఎలా తెలియజేయాలి తదితర అంశాలను ప్రజలకు వివరించారు. యాప్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ పలువురితో అక్కడికక్కడే యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ట్రాఫిక్ క్రమశిక్షణ, రహదారి భద్రతలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని, ప్రతి ఒక్కరూ ‘అస్త్రం’ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఐ బి. బాల మురళీకృష్ణ సూచించారు.

