విజయ పాల ధరలు పెంపు.. రేపటి నుంచే అమలు
ఏడు రకాల పాల ధరల్లో మార్పులు... లీటరుపై గరిష్ఠంగా రూ.4 వరకు అదనపు భారం... 9వ తేదీ ఇన్వాయిస్ నుంచే కొత్త ధరలతో బిల్లులు...

విజయవాడ, చిట్టినగర్: విజయ డెయిరీ పాల ధరలను పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెరిగిన ధరలు ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కొత్త ధరల పట్టికలను పాల ఏజెంట్లకు పంపిణీ చేసినట్లు తెలిసింది. 9వ తేదీ ఇన్వాయిస్ నుంచే సవరించిన ధరల ప్రకారం బిల్లులు జారీ చేయనున్నట్లు సమాచారం. కొత్త ధరలు ఇలా.. గోల్డ్ మిల్క్ (500 మి.లీ) — రూ.39 నుంచి రూ.40 ఫుల్ క్రీమ్ మిల్క్ (500 మి.లీ) — రూ.38 నుంచి రూ.40 స్టాండర్డ్ మిల్క్ (500 మి.లీ) — రూ.33 నుంచి రూ.35 టోన్డ్ మిల్క్ (500 మి.లీ) — రూ.31 నుంచి రూ.32 డబుల్ టోన్డ్ మిల్క్ — రూ.29 నుంచి రూ.30 ఫుల్మ్ మిల్క్ (500 మి.లీ) — రూ.36 నుంచి రూ.37 టీ మేట్ (500 మి.లీ) — రూ.36 నుంచి రూ.37 500 మి.లీ ప్యాకెట్‌పై రకాన్ని బట్టి రూ.1 నుంచి రూ.2 వరకు ధర పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

