ఆరోగ్యానికి అండగా.. రూ.5.18 లక్షల ఎల్ఓసీ
హెర్నియాతో బాధపడుతున్న సత్యనారాయణకు వైద్య సాయం ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఎల్ఓసీ మంజూరు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబానికి పత్రాల అందజేత

విజయవాడ, ఆగస్టు 27: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)లు మంజూరు చేస్తున్నారు. హెచ్బీ కాలనీకి చెందిన చలవాది సత్యనారాయణ (55) హెర్నియాతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఆయన వైద్య చికిత్స కోసం రూ.5.18 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష కలిసి భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. వైద్య సహాయం కోసం చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి ఎల్ఓసీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుజనా న్యాయమిత్ర బాయన హేరంబ కుమార్, టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

