90 ఏళ్ల వృద్ధురాలి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమైన ఆకాంక్షకు స్పందించిన ముఖ్యమంత్రి.. చీరాలలో పుష్పావతిని ఆప్యాయంగా పలకరించి కలిసి ఫోటో దిగిన సీఎం... తన చిత్రపటాన్ని మగ్గంపై నేసిన చేనేత దంపతులను అభినందించిన చంద్రబాబు...

V10 TV | బాపట్ల జిల్లా, చీరాల:
తనను ఒక్కసారి కలిసి ఫోటో దిగాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి చిరకాల కోరికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమైన ఆమె ఆకాంక్ష తన దృష్టికి రావడంతో చీరాల పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా పిలిపించుకుని ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు.
చీరాలకు చెందిన 90 ఏళ్ల పుష్పావతితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడిన సీఎం, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా కలవడంతో పుష్పావతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత దంపతులు నాగేశ్వరరావు, లక్ష్మీని కూడా సీఎం కలిశారు. మగ్గంపై వస్త్రంలో తన చిత్రపటాన్ని అత్యంత నైపుణ్యంతో నేసిన వారిని అభినందిస్తూ వారి కళానైపుణ్యాన్ని కొనియాడారు.
ప్రజల భావోద్వేగాలకు స్పందిస్తూ ఓ వృద్ధురాలి కోరికను నెరవేర్చడం, చేనేత కళాకారులను ప్రోత్సహించడం పట్ల అక్కడున్న వారు ముఖ్యమంత్రిని అభినందించారు.

