ఉచిత వైద్య సేవలకు విశేష స్పందన
ఏల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం... కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు.. అవసరమైన వారికి మందులు... ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని కమిటీ సభ్యుల వెల్లడి...

విజయవాడ: పేద, అవసరమైన ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో షారోను ప్రార్థనా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు అందించడంతో పాటు తదుపరి చికిత్సకు సంబంధించిన సూచనలు చేశారు.
శిబిరం విజయవంతానికి సహకరించిన వైద్యులు, సిబ్బంది, సేవకులతో పాటు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలకు ఏల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

