మృతుడి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక చేయూత
వాలంటీర్ తండ్రి భుక్య జన్జా నాయక్ అకాల మృతితో కుటుంబానికి పరామర్శ... డా. వల్లభనేని వంశీమోహన్ ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం... పాతపాడులో బాధిత కుటుంబానికి నగదు అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు...

పాతపాడు, ఆగస్టు 17, V10TV AP: గన్నవరం నియోజకవర్గంలోని పాతపాడు గ్రామానికి చెందిన వాలంటీర్ తండ్రి భుక్య జన్జా నాయక్ అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు.
డా. వల్లభనేని వంశీమోహన్ ఆదేశాల మేరకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జన్జా నాయక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మందా శివరాజు, గన్నవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కలపాల అబ్రహాం, వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి ఈదా కోటిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి నల్లమోతు చిన్నబాబు, పాతపాడు వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు కళ్లేపల్లి సీతారామరాజు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి దారావతు కృష్ణ నాయక్, బుద్దాల రూబెన్, కొమ్మరవెల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

