ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ3, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వరుస తుపాన్లతో అతలాకుతలం.. ఆదుకోండి అమిత్ షా!

సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్… అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావం, పంట నష్టంపై చర్చ… నష్టం అంచనాకు కేంద్ర బృందం.. అదనపు సాయం కోరిన సీఎం…

V10TV న్యూస్ డెస్క్ 3 నవంబర్, 2026 9:17 AMకి 9,806 వీక్షణలు
వరుస తుపాన్లతో అతలాకుతలం.. ఆదుకోండి అమిత్ షా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుపాన్లు వెంటాడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు అందిన సమాచారం. రాష్ట్రంలో తుపాన్ల ప్రభావం, పంటలు, ఆస్తులకు జరిగిన నష్టం, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై ఇరువురు చర్చించారు. అర్నబ్ తుపాను కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో తీవ్ర నష్టం సంభవించగా, వెంటనే మురసు తుపాను ముప్పు ఏర్పడటంతో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు, రహదారులు, విద్యుత్ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక, పునరావాస చర్యలను వివరించారు. తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపేందుకు చర్యలు తీసుకున్నందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. వరుస ప్రకృతి విపత్తులతో రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతున్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి తగిన ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరారు. అర్నబ్ తుపాను నేపథ్యంలో రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర హోంమంత్రి అక్టోబర్ 29న ప్రకటించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ హవా!

48 నిమిషాల క్రితం 8,564

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తం!

2 గంటల క్రితం 6,547

మున్సిపల్ ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థుల ముందంజ!

2 గంటల క్రితం 68,552

బెజవాడలో మొదలైన ఓట్ల లెక్కింపు హడావుడి!

2 గంటల క్రితం 6,487