ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఉంగుటూరు వద్ద వై.బి. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు

డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన అత్కూరు పోలీసులు..

V10TV న్యూస్ డెస్క్ 4 ఆగస్టు, 2026 7:30 AMకి 4 వీక్షణలు
ఉంగుటూరు వద్ద వై.బి. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు — చిత్రం 1
ఉంగుటూరు వద్ద వై.బి. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

కృష్ణ : ఆగస్టు 4 (వి 10టివి):కృష్ణాజిల్లా, ఉంగుటూరు: కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న వై.బి. (Y.B.) ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన క్షతగాత్రులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

ఉంగుటూరు వద్ద వై.బి. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు — అదనపు చిత్రం 2

ప్రమాద సమాచారం అందుకున్న అత్కూరు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

'ఏపీ అస్త్రం' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించాలి: ట్రాఫిక్ సీఐ రవికుమార్

1 నిమిషం క్రితం 1,122

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ గళం.. లోకేష్ రాజీనామా వరకు పోరాటం: ఆర్కే రోజా, భూమన

1 గంట క్రితం 553

నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

2 గంటల క్రితం 897

బీహార్‌లో బీజేపీకి షాక్.. ప్రశాంత్ కిషోర్

నిన్న 636