32వ డివిజన్లో షేక్ రహింతునిస్సా నామినేషన్
వైసీపీ తరఫున బరిలోకి మాజీ కార్పొరేటర్… బొబ్బూరి గ్రౌండ్ సచివాలయంలో నామినేషన్ పత్రాల సమర్పణ… వెంట ఉన్న పార్టీ నాయకులు పొదిలి చంటిబాబు, బొమ్మా మధు…

విజయవాడ, అక్టోబర్ 16: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 32వ డివిజన్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ షేక్ రహింతునిస్సా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భవానీపురంలోని బొబ్బూరి గ్రౌండ్ సచివాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి పొదిలి చంటిబాబు, వైసీపీ నాయకుడు బొమ్మా మధు పాల్గొన్నారు.

