ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

83వ డివిజన్‌లో కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం… సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వెల్లడి… విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 19 అక్టోబర్, 2026 10:32 AMకి 4,900 వీక్షణలు
కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 18: ప్రజల సమస్యలపై స్పందిస్తూ డివిజన్‌ అభివృద్ధికి కృషి చేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 83వ డివిజన్‌ ఎల్‌బీఎస్‌ నగర్‌ కాదరమ్మ కొట్టు వద్ద నుంచి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానికులను కలుసుకుని కూటమి అభ్యర్థికి మద్దతు కోరారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, అర్హులకు సంక్షేమ పథకాల అందజేత, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. కూటమి అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి మద్దతు పొందాలన్నారు. ప్రజల ఆదరణ, కార్యకర్తల కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

15 గంటల క్రితం 2,256