ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

లాడ్జీలు, డార్మిటరీల్లో ఈగల్‌ తనిఖీలు

ఆపరేషన్‌ త్రిశూలంలో భాగంగా కృష్ణలంక పరిధిలో సోదాలు... మూడు కేంద్రాల్లో 14 మందికి డ్రగ్‌ పరీక్షలు.. అందరికీ నెగెటివ్‌... మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు: ఈగల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 10:05 PMకి 4,882 వీక్షణలు
లాడ్జీలు, డార్మిటరీల్లో ఈగల్‌ తనిఖీలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 10: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఆపరేషన్‌ త్రిశూలంలో భాగంగా విజయవాడలోని లాడ్జీలు, డార్మిటరీల్లో ఈగల్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈగల్‌ చీఫ్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు, ఆపరేషన్స్‌ ఎస్పీ కె.ఎం. మహేశ్వర్‌రాజు, అడ్మిన్‌ ఎస్పీ స్వరూపరాణి సూచనలతో ఈగల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవీంద్ర ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోదాలు చేపట్టారు. శ్రీరామయ్య లాడ్జ్‌, శ్రీశ్రీనివాస డార్మిటరీ, రామయ్య డార్మిటరీల్లో సుమారు 14 మందికి డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర మాట్లాడుతూ లాడ్జీలు, డార్మిటరీలు, రెసిడెన్సీల్లో తనిఖీలు కొనసాగిస్తామని, మాదకద్రవ్యాల వినియోగం లేదాఅక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా, డ్రగ్స్‌ వినియోగంపై సమాచారం ఉంటే ఈగల్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు తెలియజేయాలని కోరారు. తనిఖీల్లో ఈగల్‌ మహిళా ఎస్‌ఐ ఎస్‌. దుర్గాభవాని, ఆర్‌ఎస్‌ఐలు రాంబాబు, శ్రీరామమూర్తి, ఈగల్‌, కృష్ణలంక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086