ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సమన్వయంతో విజయఢంకా మోగించాలి

స్థానిక ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయమే లక్ష్యం డివిజన్లవారీగా పార్టీల బలాబలాలపై కూటమి నేతల చర్చ ఇప్పటి నుంచే సమష్టి కార్యాచరణ అమలుకు కీలక నిర్ణయం

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 7:02 PMకి 3,259 వీక్షణలు
సమన్వయంతో విజయఢంకా మోగించాలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 26 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేసి నూటికి నూరుశాతం విజయం సాధించాలని ఎన్టీఆర్ జిల్లా కూటమి సమన్వయ కమిటీ నిర్ణయించింది. నాయకులు, కార్యకర్తలు విభేదాలకు తావులేకుండా ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. శనివారం విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎన్టీఆర్ జిల్లా కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంపై విస్తృతంగా చర్చించారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆయా డివిజన్లలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన విధానం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యాచరణపై నేతలు చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే సమష్టి కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్డీఏ కూటమి సమన్వయకర్త, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎన్నికల పరిశీలకుడు మక్కెన మల్లికార్జున, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య, గద్దె రామమోహన్, శ్రీరామ్ తాతయ్య, కూటమి నాయకులు అడ్డూరి శ్రీరామ్, అమ్మిశెట్టి వాసు, బండి కోమలి, బొలిశెట్టి శ్రీకాంత్, ఉప్పలపాటి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086