ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం

భక్తుల భద్రతే ప్రధాన బాధ్యత: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌... దసరాకు 25 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం... 60 లక్షల లడ్డూల తయారీకి దేవస్థానం ఏర్పాట్లు...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 4:43 PMకి 2,878 వీక్షణలు
భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం — చిత్రం 1
భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం — చిత్రం 2
భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 28: ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో సామాన్య భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. దసరా మహోత్సవాల ఏర్పాట్లపై సోమవారం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, శాసనమండలి సభ్యుడు వర్ల రామయ్య, నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు, దేవాదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.ఇలక్కియ, నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌.ఎం.ధ్యానచంద్‌, డీసీపీ జి.రామకృష్ణ, దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె.శీనా నాయక్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల దర్శన ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ, భద్రత, ట్రాఫిక్‌, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, తాగునీరు, అన్నప్రసాద పంపిణీపై సమగ్రంగా సమీక్షించారు. 25 లక్షల మంది వచ్చే అవకాశం దసరా మహోత్సవాలతోపాటు భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తులను కలిపి 25 లక్షల మందికి పైగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఘాట్‌రోడ్లు, పార్కింగ్‌ ప్రాంతాలు, దర్శన మార్గాలను అనుసంధానిస్తూ పటిష్ఠ కార్యాచరణ రూపొందించామన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎండ, వర్షం తగలకుండా పూర్తిస్థాయి షెడ్లు, నిరంతర తాగునీటి సరఫరా, కూర్చునే సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. దర్శనానికి పట్టే సమయాన్ని తెలియజేసేందుకు డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల కోసం సుమారు 60 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విశాలమైన అన్నదాన భవనం ద్వారా నిరంతరం శుచికరమైన అన్నప్రసాదం అందిస్తామని తెలిపారు. తల్లులు, చిన్నారులకు ప్రత్యేక కేంద్రాలు ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ ప్రతి సామాన్య భక్తుడు సంతృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ రహిత విధానంలో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. చంటిపిల్లలతో వచ్చే తల్లుల కోసం క్యూలైన్ల వద్ద వేడి పాలు, బిస్కెట్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనమండలి సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ దసరా నవరాత్రులు భక్తులందరి పండుగని, ప్రత్యేక దర్శనాల సంస్కృతికి

భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం — అదనపు చిత్రం 2
భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం — అదనపు చిత్రం 3

తావులేకుండా సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భక్తులు గంటల తరబడి నిరీక్షించకుండా త్వరితగతిన దర్శనం పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. మూలా నక్షత్రం రోజున ప్రత్యేక ఏర్పాట్లు దేవాదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున అధిక రద్దీ ఏర్పడే అవకాశమున్నందున ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. విధులతో సంబంధం లేని సిబ్బంది కొండపైకి రావడం వల్ల సున్నిత ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ సవాలుగా మారుతోందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ కెమెరాలతో నిరంతర నిఘా నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆధునిక కృత్రిమ మేధ కెమెరాలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక నియంత్రణ కేంద్రం ద్వారా కొండపై, పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. నగర శివార్లు, ప్రధాన కూడళ్లలో పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి భక్తులను తరలించేందుకు ఉచిత రవాణా బస్సులు నడుపుతామని వెల్లడించారు. జాయింట్‌ కలెక్టర్‌ జి.ఇలక్కియ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు పూర్తి చేసినట్లు తెలిపారు. ఘాట్‌రోడ్లు, క్యూలైన్లు, కీలక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, అత్యవసర సేవలకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతామన్నారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల టికెట్లు నూతన పూజా మండపంలో ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీహోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఆర్జిత సేవల టికెట్లను దేవాదాయ శాఖ అధికారిక అంతర్జాల వేదికతోపాటు ‘మనమిత్ర’ వాట్సాప్‌ సంఖ్య 9552300009 ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. పరోక్ష సేవలను నమోదు చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహించి, ప్రసాదాలను తపాలా ద్వారా పంపనున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి నగర పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు జీపీఎస్‌ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086