ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సేవా స్ఫూర్తిగా రాజ్‌కుమార్‌ జ్ఞాపకాలు

300 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, విద్యా సామగ్రి పంపిణీ… వ్యక్తిగత విషాదాన్ని సమాజ సేవగా మార్చడం అభినందనీయం… యువత ప్రమాదాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే బొండా ఉమా…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 7:01 PMకి 4,757 వీక్షణలు
సేవా స్ఫూర్తిగా రాజ్‌కుమార్‌ జ్ఞాపకాలు — చిత్రం 1
సేవా స్ఫూర్తిగా రాజ్‌కుమార్‌ జ్ఞాపకాలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 5: రాజ్‌కుమార్‌ జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగించడం అభినందనీయమని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 63వ డివిజన్‌ ఉడా కాలనీ ప్రధాన రహదారిలో ఆర్‌కే ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్‌ చైర్మన్‌ వట్టే వెంకటేశ్వరరావు కుమారుడు వట్టే రాజ్‌కుమార్‌ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 300 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, విద్యకు అవసరమైన సామగ్రిని ఎమ్మెల్యే బొండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే మంచి భవిష్యత్తు ఉన్న రాజ్‌కుమార్‌ను కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన తమ మధ్య లేకపోయినా జ్ఞాపకాలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలుగా కొనసాగించడం సేవా స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. ఏటా రాజ్‌కుమార్‌ వర్ధంతి సందర్భంగా పేదలు, విద్యార్థులకు సాయం చేస్తూ వట్టే వెంకటేశ్వరరావు కుటుంబం మానవతా విలువలను

సేవా స్ఫూర్తిగా రాజ్‌కుమార్‌ జ్ఞాపకాలు — అదనపు చిత్రం 2

చాటుతోందన్నారు. 63వ డివిజన్‌లో రాజ్‌కుమార్‌ పేరుతో పార్కును ఏర్పాటు చేయడంతోపాటు చిన్నారులకు అవసరమైన ఆట వస్తువులు, ఇతర సౌకర్యాలను సొంత ఖర్చులతో సమకూర్చడం అభినందనీయమన్నారు. వ్యక్తిగత విషాదాన్ని బాధగా మిగిల్చకుండా సమాజ సేవకు మార్గంగా మార్చడం గొప్ప విషయమని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని బొండా ఉమా సూచించారు. రోడ్డు ప్రమాదాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సమాజ సేవ వంటి సానుకూల కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. రాజ్‌కుమార్‌ పేరిట సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్త నవనీతం సాంబశివరావు, వట్టే చందు, మాజీ కార్పొరేటర్‌ పైడి తులసి, డివిజన్‌ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, మోత్కూరి క్రాసింగ్‌, పైడి శ్రీను, బత్తుల కొండ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086