నడిరోడ్డుపై అగ్నిగోళంగా మారిన విద్యుత్ బస్సు
పెదకాకాని పరిధిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు… షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా… సకాలంలో దిగిపోయిన ప్రయాణికులు—తప్పిన ప్రాణనష్టం…

గుంటూరు జిల్లా, పెదకాకాని: ప్రయాణికులతో వెళ్తున్న విద్యుత్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన పెదకాకాని పరిధిలో చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలను గుర్తించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

