ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

28 డివిజన్లలో కూటమి గెలుపే లక్ష్యం

ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

V10TV న్యూస్ డెస్క్ 25 సెప్టెంబర్, 2026 7:57 PMకి 2,315 వీక్షణలు
28 డివిజన్లలో కూటమి గెలుపే లక్ష్యం — చిత్రం 1
28 డివిజన్లలో కూటమి గెలుపే లక్ష్యం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 28 డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. మల్లికార్జునపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్‌లో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం

28 డివిజన్లలో కూటమి గెలుపే లక్ష్యం — అదనపు చిత్రం 2

కష్టపడుతున్న వారిని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం 55వ డివిజన్‌లో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు విశేషంగా కృషిచేసిన ఐదుగురు కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని నూర్‌బాషా కార్పొరేషన్‌ చైర్మన్‌ కె నాగుల్‌మీరా అందజేశారు. కార్యక్రమంలో ఎంఎస్‌ బేగ్‌, ధనేకుల సుబ్బారావు, కొట్టేటి హనుమంతరావు, ఎండీ ఫతావుల్లా, ఎస్‌కే ఆశ, గుర్రంకొండ, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086