పెళ్లింటికి బయల్దేరారు.. ప్రమాదం నుంచి బయటపడ్డారు!
మచిలీపట్నం నుంచి వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... సింగరాయకొండ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ వద్ద ఘటన... వాహనం ముందు భాగం ధ్వంసం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు...

కృష్ణా/ప్రకాశం, ఆగస్టు 28: మచిలీపట్నం నుంచి వివాహ కార్యక్రమానికి వెళ్తున్న పెళ్లి బృందానికి పెను ప్రమాదం తప్పింది. 11 మంది ప్రయాణిస్తున్న వాహనం ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రాంతం వద్ద ప్రమాదానికి గురైంది.
వాహనం ముందు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపుతప్పి రహదారి మధ్యలోని సిమెంట్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
అయితే వాహనంలో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్‌కు తరలించినట్లు సమాచారం.

