సితార సర్కిల్లో ఈట్ స్ట్రీట్
రూ.1.78 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు… నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి… పార్కింగ్, సీటింగ్ సహా మౌలిక వసతులపై అధికారులతో చర్చ…

విజయవాడ, అక్టోబరు 6: విద్యాధరపురంలోని సితార సర్కిల్ వద్ద ఏర్పాటు చేయనున్న ఈట్ స్ట్రీట్ నిర్మాణ స్థలాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం పరిశీలించారు. ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిపాదిత ఏర్పాట్లపై చర్చించారు. జాతీయ ఆరోగ్య మిషన్, ఆహార భద్రత కమిషనర్ విభాగం, విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ నిధుల ద్వారా రూ.1.78 కోట్లతో ఈట్ స్ట్రీట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడంతోపాటు వ్యాపారాలు సజావుగా సాగేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈట్ స్ట్రీట్‌కు వచ్చే వారి కోసం పార్కింగ్, కూర్చునే ప్రదేశం, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ పి.సత్యకుమారి, పార్కుల విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.చంద్రశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ కె.శరత్, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

