ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ26, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

‘అర్నాబ్’ తుఫాను సహాయక చర్యలకు రూ.27 కోట్లు!

రాష్ట్రంలోని 20 జిల్లాలకు అత్యవసర నిధులు విడుదల… ఏడు జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయింపు… మరో 13 జిల్లాలకు రూ.కోటి చొప్పున మంజూరు…

V10TV న్యూస్ డెస్క్ 26 అక్టోబర్, 2026 9:05 PMకి 3,274 వీక్షణలు
‘అర్నాబ్’ తుఫాను సహాయక చర్యలకు రూ.27 కోట్లు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్‌ను ‘అర్నాబ్’ తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలను వేగవంతం చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.14 కోట్లు కేటాయించింది. శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.13 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత, అత్యవసర సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కాగా, అక్టోబర్ 28 ఉదయానికి తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సెంట్రల్‌లో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం!

1 గంట క్రితం 5,490

74వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి విస్తృత ప్రచారం

2 గంటల క్రితం 5,874

జగన్ రాజకీయ అస్త్రాలు దౌర్జన్యాలు, అక్రమాలే: ఎమ్మెల్యే గద్దె

2 గంటల క్రితం 3,180

39వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బండారి వసంతకుమారి తరఫున ప్రచారం

2 గంటల క్రితం 3,150