74వ డివిజన్లో ఎన్డీఏ కూటమి విస్తృత ప్రచారం
గోపి సాయికుమార్‌కు మద్దతుగా బొండా రవితేజ ప్రచారం… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని వెల్లడి… పింఛన్ల పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాల ప్రస్తావన…

విజయవాడ, అక్టోబర్ 26: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 74వ డివిజన్ అమరావతి కాలనీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోపి సాయికుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా రవితేజ పాల్గొని స్థానిక ప్రజలను కలిశారు. కూటమి అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వృద్ధాప్య పింఛను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.

