ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ26, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

జగన్ రాజకీయ అస్త్రాలు దౌర్జన్యాలు, అక్రమాలే: ఎమ్మెల్యే గద్దె

రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తుంటే జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ… స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శ… ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారని ధ్వజం…

V10TV న్యూస్ డెస్క్ 26 అక్టోబర్, 2026 9:22 PMకి 3,180 వీక్షణలు
జగన్ రాజకీయ అస్త్రాలు దౌర్జన్యాలు, అక్రమాలే: ఎమ్మెల్యే గద్దె — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 26: దౌర్జన్యాలు, అక్రమాలు, దాడులే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ అస్త్రాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే, జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం పటమట అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గద్దె రామమోహన్ మాట్లాడారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరు, మాచర్ల, పూతలపట్టు, తంబళ్లపల్లి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పులివెందుల, బద్వేల్ తదితర ప్రాంతాల్లో బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పుంగనూరు, రాయచోటి, కడప, పులివెందుల ప్రాంతాల్లో వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓటమి భయంతో నామినేషన్ల ప్రక్రియను వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టుల్లో 59 కేసులు వేశారని, రూ.12,600 కోట్ల పంచాయతీ నిధులను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మరణాలను సైతం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. జగన్‌కు రాజకీయ, మానవతా విలువలు లేవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సెంట్రల్‌లో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం!

1 గంట క్రితం 5,490

74వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి విస్తృత ప్రచారం

2 గంటల క్రితం 5,874

‘అర్నాబ్’ తుఫాను సహాయక చర్యలకు రూ.27 కోట్లు!

2 గంటల క్రితం 3,274

39వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బండారి వసంతకుమారి తరఫున ప్రచారం

2 గంటల క్రితం 3,150