ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పశ్చిమంలో బీసీలకే పెద్దపీట!

కార్పొరేటర్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా… వందకు వంద శాతం గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాం: బుద్ధా వెంకన్న… మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు పశ్చిమం నుంచే అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా…

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 12:05 PMకి 2,874 వీక్షణలు
పశ్చిమంలో బీసీలకే పెద్దపీట! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని మాజీ ఎమ్మెల్సీ, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న తెలిపారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా చేతుల మీదుగా అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థుల్లో 11 మంది బీసీలకు అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సామాజిక న్యాయానికి, వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. వందకు వంద శాతం విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి డివిజన్‌లో విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ లభిస్తుందని బుద్ధా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!

29 నిమిషాల క్రితం 4,901

భవానీలకు లడ్డూ ప్రసాదం కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు

34 నిమిషాల క్రితం 3,796

హామీలు కాదు అమలును చూసి ఓటేయాలి!

40 నిమిషాల క్రితం 2,890

బుద్ధా హామీతో చల్లారిన అసమ్మతి సెగలు!

1 గంట క్రితం 1,989