ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బుద్ధా హామీతో చల్లారిన అసమ్మతి సెగలు!

52వ డివిజన్‌లో చివరి నిమిషంలో మారిన రాజకీయ సమీకరణాలు… పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించిన స్థానం… గంగాధర్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని బుద్ధా వెంకన్న భరోసా…

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 12:00 PMకి 1,989 వీక్షణలు
బుద్ధా హామీతో చల్లారిన అసమ్మతి సెగలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 52వ డివిజన్‌లో తలెత్తిన అసమ్మతి వ్యవహారానికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న జోక్యంతో తెరపడింది. పొత్తు ధర్మంలో భాగంగా చివరి నిమిషంలో 52వ డివిజన్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో టీడీపీ తరఫున అవకాశం ఆశించిన గంగాధర్‌రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. తనకు అవకాశం చేజారడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బుద్ధా వెంకన్న వెంటనే రంగంలోకి దిగి గంగాధర్‌రెడ్డితో మాట్లాడారు. కూటమి పొత్తుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు అన్యాయం జరగదని, గంగాధర్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనని బహిరంగంగా హామీ ఇచ్చారు. బుద్ధా వెంకన్న ఇచ్చిన భరోసాతో గంగాధర్‌రెడ్డి అసంతృప్తి సద్దుమణిగింది. దీంతో చివరి నిమిషంలో రాజకీయ వేడి రేపిన 52వ డివిజన్ వ్యవహారం సుఖాంతమైంది. బుద్ధా వెంకన్న జోక్యంతో కూటమిలో సమన్వయం కుదిరినట్లు ఈ పరిణామం చర్చనీయాంశమైంది. అయితే తొలుత నిరసన వ్యక్తమైన నేపథ్యంలో అసమ్మతి సెగలు, నిరసనలంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బుద్ధా వెంకన్న పేర్కొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!

26 నిమిషాల క్రితం 4,899

భవానీలకు లడ్డూ ప్రసాదం కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు

31 నిమిషాల క్రితం 3,796

హామీలు కాదు అమలును చూసి ఓటేయాలి!

37 నిమిషాల క్రితం 2,890

పశ్చిమంలో బీసీలకే పెద్దపీట!

1 గంట క్రితం 2,874