ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఆటోనగర్‌ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం

డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక దృష్టి… చెత్త తొలగింపు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష… ఐలా చైర్మన్‌తో సమావేశమైన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 7:49 PMకి 2,701 వీక్షణలు
ఆటోనగర్‌ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 5: ఆటోనగర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తెలిపారు. పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. గత శుక్రవారం ఎమ్మెల్యే నగరంలో అందుబాటులో లేకపోవడంతో ఆ రోజు జరగాల్సిన ప్రజాదర్బార్‌ను సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం ఆటోనగర్‌లోని డ్రైనేజీ సమస్యలపై ఐలా చైర్మన్‌ అన్నే శివనాగేశ్వరరావు, ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, చెత్త తొలగింపు, పారిశుధ్య నిర్వహణతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించడంతోపాటు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని గద్దె రామమోహన్‌ హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సుంకర దుర్గాప్రసాద్‌, అబ్దుల్‌ కలాం, ముమ్మనేని ప్రసాద్‌, కత్తిక శివనాగేశ్వరరావు, పడాల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086