ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భక్తిశ్రద్ధలతో మహబూబ్‌ సుభాని గ్యార్మీ దావత్‌

ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు… ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించిన వైకాపా నేత… మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆధ్యాత్మిక వేడుకలు…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 10:09 AMకి 3,277 వీక్షణలు
భక్తిశ్రద్ధలతో మహబూబ్‌ సుభాని గ్యార్మీ దావత్‌ — చిత్రం 1
భక్తిశ్రద్ధలతో మహబూబ్‌ సుభాని గ్యార్మీ దావత్‌ — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 3: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హజ్రత్‌ మహబూబ్‌ సుభాని గ్యార్మీ దావత్‌ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. మహబూబ్‌ సుభాని జెండా చెట్టు దర్గా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ హస్సన్‌ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలకు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలు,

భక్తిశ్రద్ధలతో మహబూబ్‌ సుభాని గ్యార్మీ దావత్‌ — అదనపు చిత్రం 2

ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సోదరభావం, మతసామరస్యం వెల్లివిరియాలని ప్రార్థించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి గ్యార్మీ దావత్‌లో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు, వారికి స్వయంగా విందును వడ్డించారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు, ముస్లిం మతపెద్దలు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086