గుణదల సెంటర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
ఎలూరు రోడ్డులో ఘటన… మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… వివరాలు తెలిసినవారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి…

విజయవాడ, అక్టోబరు 1: విజయవాడ ఎలూరు రోడ్డులోని గుణదల సెంటర్ వద్ద బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతుడి పూర్తి వివరాలు, చిరునామా ఇంకా తెలియరాలేదు. అతడిని గుర్తించినవారు లేదా సంబంధిత వివరాలు తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

