ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

చెత్త కుప్పల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

107 వ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్వహణపై ఒకరోజు శిక్షణ... బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిర్ణయం... రహదారుల పక్కన చెత్త తొలగింపునకు ‘స్వచ్ఛపథం’ యంత్రాలు...

V10TV న్యూస్ డెస్క్ 30 సెప్టెంబర్, 2026 8:26 PMకి 2,593 వీక్షణలు
చెత్త కుప్పల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, సెప్టెంబరు 30: రాష్ట్రాన్ని చెత్త కుప్పల రహితంగా తీర్చిదిద్దాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 107 వ్యర్థాల శుద్ధి కేంద్రాల సమర్థ నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాయపూడిలోని మూడో బ్లాక్‌లో బుధవారం కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అధ్యక్షతన జరిగిన డైరెక్టర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కాన్పూర్‌ ఐఐటీ, కేపీఎంజీ సంస్థల సహకారంతో ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించి రాష్ట్రంలో నెట్‌ జీరో లక్ష్యాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మార్కెట్లు, దేవాలయాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, గ్రామాల్లో చెరువుల శుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పేరుకుపోయిన పాత చెత్తను త్వరగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో జేసీబీలను వినియోగించాలన్నారు. నగరాలు, పట్టణాల్లో తాజాగా సేకరిస్తున్న చెత్తను పాత చెత్తలో కలపకుండా చూడాలని, ఈ మేరకు పురపాలక కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. రహదారుల పక్కన పేరుకుపోయే చెత్తను తొలగించేందుకు ‘స్వచ్ఛపథం’ పేరుతో ప్రత్యేక యంత్రాలను వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక యంత్రాన్ని అందించే ఆలోచన ఉందన్నారు. కొబ్బరి బోండాలు సహా రోడ్ల పక్కన ఉండే వ్యర్థాలను ఈ యంత్రాలు తొలగిస్తాయని వివరించారు. బయోమైనింగ్‌, వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారీ కేంద్రాలు, ఈ–ఆటోలు, వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్లు, ఇతర యంత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లాలు, పురపాలక సంఘాల వారీగా సిద్ధం చేసి డైరెక్టర్లకు అందించాలని ఆదేశించారు. కొనుగోలు చేసే యంత్రాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ, తడి, పొడి వ్యర్థాల నిర్వహణ, ద్రవ వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగం, జీవ ఎరువుల తయారీ, సౌర విద్యుత్‌, పదిహేనో ఆర్థిక సంఘం నిధుల వినియోగం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పురపాలక సంఘాలు, పంచాయతీలకు పంపిణీ చేసేందుకు 267 ఈ–ఆటోలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సమావేశంలో కార్పొరేషన్‌ ఎండీ బండా సునీల్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్లు, పట్టణ, గ్రామీణ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పురపాలక పరిపాలన కమిషనర్‌, డైరెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086