కిటికీ తెరిచి.. బంగారం చోరీ!
కండ్రికలో ఇంట్లో దాచిన పది తులాల ఆభరణాలు మాయం… కుమారుల వద్దకు వెళ్లి తిరిగొచ్చేసరికి వెలుగులోకి చోరీ… నున్న పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు…

విజయవాడ: కండ్రికలోని ఓ ఇంట్లో పది తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితురాలు అమ్రాజి తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 8న ఆమె తన తల్లితో కలిసి వైజాగ్‌లో ఉంటున్న కుమారుల వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా పడకగది కిటికీ తెరిచి ఉండటాన్ని గుర్తించారు. పడకగదిలోని డబ్బాలో దాచిన పది తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఘటనపై బాధితురాలు మంగళవారం నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

