ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భవానీ భక్తులకు బాక్సుల్లో లడ్డూ ప్రసాదం!

ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు… ప్రసాదాల పంపిణీపై అధికారులకు ఈవో శీనా నాయక్ ఆదేశాలు… లడ్డూ ప్రసాదాల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేసిన భవానీ భక్తులు…

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 1:48 PMకి 3,247 వీక్షణలు
భవానీ భక్తులకు బాక్సుల్లో లడ్డూ ప్రసాదం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 21: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివస్తున్న భవానీ భక్తులకు లడ్డూ ప్రసాదాల పంపిణీలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించిన బాక్సుల్లో లడ్డూ ప్రసాదాలను అందజేస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే శీనా నాయక్ ఆదేశాల మేరకు ప్రసాదాల కౌంటర్ల వద్ద సిబ్బంది భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను అందిస్తున్నారు. ప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి ఈవో సూచించారు. దసరా ఉత్సవాల అనంతరం భవానీ దీక్షల విరమణ కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సేవకుల సమన్వయంతో భక్తులకు సేవలు అందిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. లడ్డూ ప్రసాదాలను ప్రత్యేక బాక్సుల్లో అందజేయడంపై పలువురు భవానీ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసాదాల పంపిణీలో సౌకర్యాలు కల్పించిన ఆలయ ఈవో శీనా నాయక్‌తో పాటు దేవస్థాన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడలో బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు!

41 నిమిషాల క్రితం 0

52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా దాడి అప్పారావు!

1 గంట క్రితం 3,254

మూడోసారి కార్పొరేటర్ బరిలో బుల్లా విజయ్ కుమార్!

1 గంట క్రితం 3,691

కృష్ణలంకలో కత్తితో యువకుడిపై దాడి!

2 గంటల క్రితం 3,849