ఘనంగా మహావీర్ జన్మ వాంచన్ మహోత్సవం
సోలంకి రాజేంద్రకుమార్ జైన్ నివాసంలో వైభవంగా వేడుకలు భజనలు, కీర్తనలతో మార్మోగిన సోలంకి కాంప్లెక్స్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్న టీడీపీ నాయకులు, భక్తులు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 13: వన్‌టౌన్‌లోని సోలంకి కాంప్లెక్స్‌లో టీడీపీ వాణిజ్య విభాగం కన్వీనర్ సోలంకి రాజేంద్రకుమార్ జైన్ నివాసంలో మహావీర్ జన్మ వాంచన్ మహోత్సవాన్ని శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర ఉత్సవంలో భక్తులు మహావీరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. భజనలు, కీర్తనలు ఆలపించడంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ

వెల్లివిరిసింది. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కోగంటి రామారావు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వన్‌టౌన్ పాత శివాలయం చైర్మన్ ధనేకుల వెంకట సుబ్బారావు, 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చినసుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్‌తోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
