ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సీతారామపురంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల ఆస్తి నష్టం!

పూర్తిగా దగ్ధమైన రఘువంశీ టింబర్ డిపో... ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు... బాధితులకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని భరోసా...

V10TV న్యూస్ డెస్క్ 2 నవంబర్, 2026 6:45 PMకి 42,544 వీక్షణలు
సీతారామపురంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల ఆస్తి నష్టం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 2: విజయవాడ సీతారామపురంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రఘువంశీ టింబర్ డిపో అగ్నికి ఆహుతై సుమారు రూ.4 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన టింబర్ డిపో యజమానులను, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుతో పాటు ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుకోని ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితులు అధైర్యపడవద్దని, ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉంటానని బొండా ఉమామహేశ్వరరావు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తానని, వ్యక్తిగతంగానూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు త్వరగా ఆర్థికంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడ తీర్పుకు కౌంట్‌డౌన్.. రేపే ఓట్ల లెక్కింపు!

20 నిమిషాల క్రితం 1

నీ ధైర్యానికి సెల్యూట్ లక్ష్మీ! 🔥🫡

30 నిమిషాల క్రితం 9,873

నిడమానూరులో పరిమి సింధూర ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ర్యాలీ!

3 గంటల క్రితం 7,573

గుడ్లవల్లేరులో కూటమి రోడ్‌షో.. బైక్ ర్యాలీతో సందడి!

4 గంటల క్రితం 6,896