నిడమానూరులో పరిమి సింధూర ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ర్యాలీ!
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులతో ర్యాలీ… ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలిసిన అభ్యర్థులు… స్థానిక సమస్యలు, గ్రామాభివృద్ధి అంశాలపై ప్రచారం…

విజయవాడ, నవంబర్ 2 : నిడమానూరు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పరిమి సింధూర ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిడమానూరులో పరిమి సింధూర పర్యటనతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది.

