చంద్రబాబుతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
అమరావతి నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ… మోహన్ యాదవ్‌కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్… యువగళం పాదయాత్ర పుస్తకం అందజేత…

అమరావతి, అక్టోబర్ 17: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ఆయనకు వివరించారు. అంతకుముందు సీఎం నివాసానికి విచ్చేసిన మోహన్ యాదవ్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర పుస్తకాన్ని ఆయనకు అందజేసి, తన పాదయాత్రకు సంబంధించిన అంశాలను వివరించారు.

